- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు.. కేన్ మామ షాకింగ్ నిర్ణయం
కివీస్ స్టార్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.

దిశ, నేషనల్ బ్యూరో: న్యూజిల్యాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న సమయంలో తను పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇకపై తను కేవలం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడతానని ఆదివారం నాడు విలియమ్సన్ ప్రకటించాడు. కివీస్ తరఫున 93 టీ20 మ్యాచులు ఆడిన విలియమ్సన్.. 2575 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతను రిటైర్ అవుతున్నాడు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్‌కు కొంత దూరంగా ఉంటున్న కేన్.. ఇక ఈ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. కివీస్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా అద్భుతంగా రాణించిన అతను.. టీ20 ఫార్మాట్లో ఈ బాధ్యతలను మిచెల్ శాంట్నర్‌కు అప్పగించాడు. తను తప్పుకోవడం వల్ల వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం జట్టును నిర్మించడంలో టీంకు ఒక క్లారిటీ వస్తుందని, ఇదే సరైన సమయం అనిపించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని విలియమ్సన్ తెలిపాడు.






