- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ గుడ్ బై
ప్రపంచ క్రికెట్‌లో జెంటిల్‌మెన్, న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు) నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్‌లో జెంటిల్‌మెన్, న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల (టెస్టులు, వన్డేలు) నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. గత నవంబర్ లోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే అంతర్జాతీయ క్రికెటు పూర్తిగా వీడ్కోలు పలకడం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీనితో ఆయనే 16 ఏళ్ల సుదీర్ఘమైన, అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్, న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.
విలియమ్సన్ సాధించిన మైలురాళ్లు..
మొత్తం మ్యాచ్లు: 378
మొత్తం పరుగులు: 19,346
శతకాలు: 48 సెంచరీలు (ఇందులో 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి).
కివీస్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు (9,515), అత్యధిక టెస్ట్ సెంచరీలు (33) చేసిన బ్యాటర్ ఆయనే. 2016 నుండి 2024 వరకు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్గా విలియమ్సన్ అద్భుతమైన సేవలు అందించారు. ఆయన సాదర్ సారథ్యంలో కివీస్ జట్టు ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని శక్తుగా ఎదిగింది. భారత జట్టును ఓడించి, తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) గదను కైవసం చేసుకుంది. ఆయన నేతృత్వంలోనే న్యూజిలాండ్ రెండు సార్లు వన్డే ప్రపంచకప్ (2015, 2019) ఫైనల్స్ చేరింది. 2019 ఫైనల్లో బౌండరీల నిబంధనతో దురదృష్టవశాత్తూ కప్ కోల్పోయినా విలియమ్సన్ చూపిన క్రీడాస్ఫూర్తికి ప్రపంచం ఫిదా అయింది. తన రిటైర్మెంట్ సందర్భంగా విలియమ్సన్ భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. "నేను గత కొన్ని రోజులుగా దీని గురించి తీవ్రంగా ఆలోచించాను. తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని స్పష్టమైంది. న్యూజిలాండ్ తరపున ఆడిన ప్రతి మ్యాచ్లోనూ నా శక్తినంతటినీ ధారపోశాను. అంతకంటే తక్కువ శ్రమతో జట్టులో కొనసాగడం కరెక్ట్ కాదనిపించింది. నా స్వంత నిర్ణయంతో, గౌరవంగా తప్పుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. కివీస్ జట్టు భవిష్యత్తుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జట్టులో ఎంతో ప్రతిభ ఉంది అని పేర్కొన్నారు.






