- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా డేంజర్ బౌలర్ రిటైర్మెంట్
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు కేన్ రిచర్డ్సన్.

దిశ, వెబ్ డెస్క్: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ ( KANE RICHARDSON ) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు కేన్ రిచర్డ్సన్. 34 ఏళ్ల కేన్ రిచర్డ్సన్ దాదాపు 17 ఏళ్ల పాటు ఆస్ట్రేలియాకు సేవలు అందించాడు. అయితే ఏజ్ పైబడిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు వెల్లడించారు కేన్ రిచర్డ్సన్.
తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో ఆస్ట్రేలియా జట్టు తరఫున మొత్తం 25 వన్డేలు కేన్ రిచర్డ్సన్. 36 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలోనే 84 వికెట్లు కూడా తీశాడు. అదే సమయంలో 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కేన్ రిచర్డ్సన్ కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ జట్లకు ఆడాడు.






