Kamran Akmal: వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి.. పాక్‌పై కమ్రాన్ అక్మల్ సెటైర్లు

by Kema Shiva Kumar |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ఆరంభ మ్యాచ్‌లోనే అతిథ్య జట్టు పాకిస్థాన్‌ (Pakistan)కు ఊహించని షాక్ తగిలింది.

Kamran Akmal: వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి.. పాక్‌పై కమ్రాన్ అక్మల్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy-2025) ఆరంభ మ్యాచ్‌లోనే అతిథ్య జట్టు పాకిస్థాన్‌ (Pakistan)కు ఊహించని షాక్ తగిలింది. కరాచీ (Karachi) వేదికగా న్యూజిలాండ్‌ (New Zealand)తో బుధవారం జరిగిన మ్యాచ్‌ 60 పరుగులు తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఊహించని రీతిలో ఓడిపోవడం పాక్ జట్టు అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ (Pakistan) తమ సెమీస్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ టోర్నీలో చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితికి ఆ జట్టు చేరింది. అయితే పాక్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ (Karan Akmal) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే (Zimbabwe) - ఐర్లాండ్‌ (Ireland) మధ్య సిరీస్‌ జరుగుతోందని అక్కడి వెళ్లి వారితో ఆడి తిరిగి దేశానికి రావాలని సైటైర్లు వేశారు. వారిపై గెలిస్తేనే పాక్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో ఆడే అర్హత వస్తుందని కామెంట్ చేశాడు. గత ఏడేళ్లుగా తమ జట్టు ప్రదర్శన చెత్తగా ఉందని కమ్రాన్ అక్మల్ మండిపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోన్న వేళ అక్మల్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story