సెలెక్టర్లపై కైఫ్ సంచలన ఆరోపణలు

by Muthe.Rajitha |

టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు.

సెలెక్టర్లపై కైఫ్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు. మహ్మద్ కైఫ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ టీంఇండియా సెలెక్టర్లపై ఆరోపణలు గుప్పిస్తూ.. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలం కావాలని కొందరు సెలెక్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యనించాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి వారిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అన్నాడు. జట్టు నుంచి తొలగించే అవకాశం వారికి ఇవ్వకూడదని పేర్కొన్నారు.

వరల్డ్ కప్ జరిగే సౌత్ ఆఫ్రికా పిచ్ లపై కోహ్లీకి, రోహిత్ కి ఎంతో అనుభవం ఉందని, వారిద్దరూ ఆ ట్రోఫీలో తప్పకుండా ఆడాలని కైఫ్ సూచించాడు. కాగా కైఫ్ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐలో దుమారం రేపుతున్నాయి. దీనిపై ఇటు బీసీసీఐ గాని, అటు రోహిత్-కోహ్లీ ద్వయం గాని ఇంకా స్పందించలేదు.

Next Story