- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రబాడా అరాచకం..బౌండరీ గేట్ దగ్గర పడ్డ బేల్స్
కగిసో రబాడా వేసిన ఓ బంతికి టిమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి వేగానికి వికెట్ల బేల్స్ బౌండరీ గేటు దగ్గర పడ్డాయి.

Kagiso Rabada
దిశ, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబాడా ( Kagiso Rabada ) వేసిన ఓ బంతికి న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ ( Tim Seifert) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ బంతి వేగానికి వికెట్ల బేల్స్ బౌండరీ గేటు దగ్గర పడ్డాయి. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ ఫోటోను చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. కగిసో రబాడా చాలా కసిగా బౌలింగ్ చేశాడని.. ఇంత ఫాస్ట్ బౌలింగ్ తామె ఎప్పుడూ చూడలేదని క్రికెట్ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ ( Boundary) గేటు దగ్గర బేల్స్ ( Wicket Bells) పడడం చరిత్రలోనే తొలిసారి అంటున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
ఫైనల్స్ కు చేరిన న్యూజిలాండ్
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్ బరిలో న్యూజిలాండ్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సౌతాఫ్రికా చేతులెత్తేసింది. న్యూజిలాండ్ చేతిలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది సౌతాఫ్రికా. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకుంది. మార్చి 8వ తేదీన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఉండనుంది. కాగా భారత్, ఇంగ్లాండ్ లలో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఇది ఇలా ఉండగా, తొలి సెమీస్ లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి, 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది కివీస్. దీంతో ఫైనల్స్ లో అడుగు పెట్టింది న్యూజిలాండ్. ఇది ఇలా ఉండగా, టీ20 వరల్డ్ కప్ 2026 సెమీస్ దాకా అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా, ఇంటి దారి పట్టడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయింది.






