- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి సోమవారంతో 10ఏళ్లు పూర్తయ్యాయి. 2016 జనవరి 26న ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌తో పాండ్యా ఇంటర్నేషనల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ నేపథ్యంలో పాండ్యా ఇన్‌స్టాగ్రామ్ వేదిక పోస్టు పెట్టాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, తాను నడవాలనుకునే మార్గాన్ని ఇప్పుడే ప్రారంభించానని తెలిపాడు. ‘ఇది 10 ఏళ్ల ప్రయాణం. నాకు 33 ఏళ్లు నిండుతాయి. నాకిష్టమైన క్రీడను హృదయపూర్వకంగా ఆడటం ఒక విషయం. దాని ద్వారా దేశానికి సేవ చేయడం మరో విషయం. ఈ జర్నీలో నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమేనని ఈ సంవత్సరం నాకు నేర్పింది. నేను నిజంగా నడవాలనుకున్న మార్గాన్ని ఇప్పుడే ప్రారంభించా.’అని తెలిపాడు.
అలాగే, తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్న పాండ్యా..‘బరోడా తరపున ఆడేందుకు యంగ్ హార్దిక్ కొన్ని మైళ్లు పరుగెత్తేవాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేయని బౌలర్లకు బంతులు వేసే బ్యాట్స్‌మెన్. 19 ఏళ్ల వయసులో ఆల్‌రౌండర్‌గా మారాను. ఈ ప్రయాణంలో తిరస్కరణలు చూశాను. అన్నింటి కంటే నా దేశానికి ఆడటం నాకు అత్యంత విలువైన ప్రయాణం. క్రికెట్ ఆడుతూనే ఎదిగాను. ఆడుతూనే వృద్ధుడిని అవుతాను.’అని పాండ్యా రాసుకొచ్చాడు. ఆల్‌రౌండర్ పాండ్యా భారత జట్టులో కీలక సభ్యుడు. 2024 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. భారత్ తరపున ఇప్పటివరకు 94 వన్డేలు, 127 టీ20లు, 11 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 4,463 రన్స్ చేయడంతోపాటు 213 వికెట్లు తీశాడు.






