- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐదు వికెట్లతో రెచ్చిపోయిన సిద్ధిఖీ.. కెనడాపై యూఏఈ థ్రిల్లింగ్ విక్టరీ
ఐదు వికెట్లతో జునైద్ సిద్ధిఖీ రెచ్చిపోయాడు. దీంతో కెనడాపై యూఏఈ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ 2026లో యూఏఈ తొలి విజయం నమోదు చేసింది. ఢిల్లీ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచులో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా.. భారీ స్కోరు చేయలేకపోయింది. నవనీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకర్ (50), శ్రేయాస్ మొవ్వ (21) మాత్రమే కొంత పోరాడారు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. యూఏఈ బౌలర్ జునైద్ సిద్దిఖీ ఐదు వికెట్లతో నిప్పులు చెరిగాడు. దీంతో కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన యూఏఈకి కూడా ఆశించిన ఆరంభం దక్కలేదు. కెప్టెన్ మహమ్మద్ వసీమ్ (4), అలిషాన్ షరాఫూ (5), మయాంక్ కుమార్ (4), హర్షిత్ కౌశిక్ (5) పూర్తిగా నిరాశపరిచారు. అయితే మరో ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) అద్భుతంగా పోరాడి యూఏఈని విజయతీరాలకు చేర్చారు. ఈ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్లతో రాణించిన జునైద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.






