- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 ప్రపంచ కప్ కంటే ముందు ఆస్ట్రేలియా మరో షాక్
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఇవాళ లేదా రేపు కొలంబోకు చేరుకోనుంది ఆసీస్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ మొదలుకాక ముందే ఆస్ట్రేలియాకు మరోసారి తగిలింది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ ఈ టోర్నమెంట్ కు దూరం కాగా... ఇప్పుడు మరో బౌలర్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లకు జోష్ హేజల్ వుడ్ ( Josh Hazelwood) దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఫస్ట్ హాఫ్ కు జోష్ హేజల్ వుడ్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ ఉలిక్కి పడుతున్నారు.
కష్టాల్లో ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఇవాళ లేదా రేపు కొలంబోకు చేరుకోనుంది ఆసీస్. ఇలాంటి తరుణంలోనే ప్యాట్ కమిన్స్ ఈ టోర్నమెంట్ కు దూరం కాగా, ఇప్పుడు జోష్ హేజల్ వుడ్ కూడా స్టార్టింగ్ మ్యాచ్ లకు దూరం కానున్నట్లు టాక్ నడుస్తోంది. అటు మిచెల్ స్టార్క్ రిటైర్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ తో జరిగిన టీ20 సిరీస్ ను కోల్పోయింది ఆసీస్. ఇలాంటి తరుణంలో కష్టాల్లో ఆస్ట్రేలియా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.






