RCBకి బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిన డేంజర్ బౌలర్ !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ( RCB) మరో ఎదురు

RCBకి బిగ్ షాక్.. ఇంటికి వెళ్లిన డేంజర్ బౌలర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ( RCB) మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడడంతో బెంగళూరు అభిమానులు నిరాశలో ఉండగా.... ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. బెంగళూరు స్టార్ ఆటగాడు జోష్ హాజెల్‌వుడ్ (Josh Hazlewood ).. ఈ టోర్నమెంట్ నుంచి దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ప్లే ఆఫ్ కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేరుకున్న నేపథ్యంలో... ఈ స్టార్ ఆటగాడు జోష్ హాజెల్‌వుడ్ కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా... అతడు బెంగళూరు జట్టుకు దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు ఇండియాను వదిలి ఆస్ట్రేలియా కు వెళ్లేందుకు అతను సిద్ధమైనట్లు సమాచారం.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు జోష్ హాజెల్‌వుడ్. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో 18 వికెట్లు పడగొట్టాడు. కేవలం పది మ్యాచ్ లలోనే ఈ ఘనత సాధించాడు. అయితే అలాంటి ప్లేయర్.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. అటు కెప్టెన్ రజత్ ( Rajat) కూడా గాయం కారణంగా లక్నోతో మ్యాచ్ కు దూరం కాబోతున్నాడు.

Next Story