గిల్‌లో కోహ్లీ, రోహిత్ ఇద్దరి స్టైల్.. ఇద్దరి దగ్గరా మెళకువలు నేర్చుకున్నాడు: బట్లర్

by Phanindra |

గిల్‌లో కోహ్లీ, రోహిత్ ఇద్దరి స్టైల్ ఉందని, వారిద్దరి దగ్గరా మెళకువలు నేర్చుకున్నాడని బట్లర్ చెప్పాడు.

గిల్‌లో కోహ్లీ, రోహిత్ ఇద్దరి స్టైల్.. ఇద్దరి దగ్గరా మెళకువలు నేర్చుకున్నాడు: బట్లర్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గురించి ఇంగ్లండ్ స్టార్ బ్యాట్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో బట్లర్ ప్రాతినిధ్యం వహించిన గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీని దగ్గరి నుంచి చూసిన బట్లర్.. గిల్ చాలా మంచి సారధి అని కొనియాడాడు.

‘ఇంగ్లండ్ టెస్టు సిరీస్ మీద చాలా బజ్ ఉంది. ఐపీఎల్ ఇటీవలే ముగిసింది. కానీ అది జరుగుతున్నప్పుడు కూడా టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే దానిపై తెగ చర్చ జరిగింది. చివరకు శుభ్‌మన్ గిల్‌కు ఆ బాధ్యత అప్పగించారు. గుజరాత్ టైటాన్స్‌లో తను నా కెప్టెన్. తను చాలా ఇంప్రెసివ్ ప్లేయర్ అదే టైంలో బాగా మెచ్యూరిటీ ఉన్న కుర్రాడు’ అని బట్లర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో ఉండే లక్షణాలు గిల్‌లో ఉన్నాయని బట్లర్ అభిప్రాయపడ్డాడు.

‘గిల్ మాట్లాడే సమయంలో చాలా కామ్‌గా ఉంటాడు. అదే మైదానంలో దిగిన తర్వాత ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఫైట్ చేస్తాడు. తను చాలా ప్యాషనేట్ కూడా. తను కోహ్లీ, రోహిత్‌ మిక్స్ చేసిన ప్లేయర్ అవుతాడని నా అభిప్రాయం. జట్టులోకి మొఖం మీద కొట్టినట్లుండే పోటీ తత్వాన్ని కోహ్లీ తీసుకొచ్చాడు. రోహిత్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా, ఎక్కడా తొణక్కుండా ఉండే స్థిరత్వాన్ని తెచ్చాడు. గిల్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఉంటాడని నా ఫీలింగ్. ఎందుకంటే తను వాళ్లిద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. అదే టైంలో తనకంటూ ప్రత్యేకమైన ఆలోచనలు కూడా ఉన్నాయి’ అని బట్లర్ వెల్లడించాడు.

Next Story