- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్.. కెప్టెన్ బట్లర్ షాకింగ్ డెసిషన్
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ వైట్‌బాల్ కెప్టెన్‌గా తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండు పరాజయాలు పొందిన ఇంగ్లాండ్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బట్లర్ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు నిష్ర్కమించడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంగీకరించాడు. ‘ఇది నాకు, జట్టుకు సరైన నిర్ణయం. జట్టును అవసరమైన చోటుకు తీసుకెళ్లడానికి మెక్‌కల్లమ్‌తో కలిసి పనిచేసే వ్యక్తి రావొచ్చు. చాంపియన్స్ ట్రోఫీలో రెండు ఓటములు ఎదుర్కొన్నాం. టోర్నీకి ముందు కూడా భారత్ చేతిలో ఓడిపోయాం. నా కెప్టెన్సీ చివరి దశకు చేరుకుంది.’ అని చెప్పుకొచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ గ్రూపు దశకే పరిమితమైంది. వరుసగా ఆస్ట్రేలియా, అఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. తప్పక గెలవాల్సిన అఫ్గాన్‌పై పోరాటం చేసినప్పటికీ ఓటమి నుంచి బయటపడలేకపోయింది. అఫ్గాన్ చేతిలో ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. నేడు సౌతాఫ్రికాతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.






