- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్ల్యూడబ్ల్యూఈకి జాన్ సెనా గుడ్ బై.. ఓటమితో సుదీర్ఘ కెరీర్‌ను ముగించిన దిగ్గజ రెజ్లర్
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) చరిత్రలో ఓ శకం ముగిసింది.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) చరిత్రలో ఓ శకం ముగిసింది. ప్రొఫెషనల్ రెజ్లింగ్ సూపర్‌స్టార్ జాన్ సెనా తన సుదీర్ఘమైన్ కెరీర్‌కు ముగింపు పలికాడు. గతేడాదే రిటైర్మెంట్‌పై ప్రకటన చేసిన అతను ఆదివారం తన చివరి మ్యాచ్ ఆడేశాడు. జాన్ సెనా తన రెజ్లింగ్ ప్రయాణాన్ని ఓటమితో ముగింపు పలకడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. వాషింగ్టన్ డీ.సీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జాన్ సెనాపై గుంథర్ విజయం సాధించాడు. రింగ్‌లో అతన్ని చివరి సారిగా చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బౌట్ ఆద్యంతం ఫ్యాన్స్ జాన్ సెనాకు మద్దతుగా నిలిచారు. ఆరంభంలో గుంథర్‌పై సెనా పిడి గుద్దులతో విరుచుకుపడ్డాడు. అయితే మ్యాచ్ సాగుతున్నకొద్ది గుంథర్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. ఆఖర్లో సెనా భుజాన్ని లక్ష్యంగా చేసుకుని పట్టు బిగించడంతో అతని విజయం లాంఛనమైంది. మ్యాచ్ అనంతరం ప్రేక్షకులందరూ జాన్ సెనాకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. తన షూస్‌ను రింగ్‌లోనే ఉంచి అక్కడి నుంచి నిష్ర్కమించిన అతను ‘యు కాంట్ సీ మీ’అని వ్యాఖ్యానించాడు.
48 ఏళ్ల జాన్ సెనా 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. 17సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. అత్యధిక సార్లు వరల్ద్ టైటిల్ సాధించింది అతనే కావడం విశేషం. ఐదుసార్లు యునైటెడ్ స్టేట్స్ చాంపియన్‌షిప్, నాలుగుసార్లు ట్యాగ్ టీమ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ నిలిచాడు. మొత్తంగా డబ్ల్యూడబ్ల్యూఈపై తనదైన ముద్ర వేసిన జాన్ సెనా భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన విషయం తెలిసిందే.






