ఆంధ్ర చేతిలో ఓడినా ఫైనల్‌ చేరిన జార్ఖండ్

by Phanindra |

ఆంధ్ర చేతిలో జార్ఖండ్ టీం 9 పరుగుల తేడాతో ఓడింది. అయినా సరే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 లీగ్ ఫైనల్ చేరింది.

ఆంధ్ర చేతిలో ఓడినా ఫైనల్‌ చేరిన జార్ఖండ్
X

దిశ, స్పోర్ట్స్ డెస్క్: పూణేలో జరిగిన స్మాట్ (సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 లీగ్) మ్యాచులో ఆంధ్ర చేతిలో ఓడినా.. జార్ఖండ్ జట్టు తొలిసారి టోర్నీ ఫైనల్ చేరింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర టీం 7 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు శ్రీకర్ భరత్ (35), అశ్విన్ హెబ్బదర్ (30)తోపాటు నితీశ్ కుమార్ (45) రాణించారు. బౌలింగ్‌లో కూడా రానించిన నితీశ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో తడబడిన జార్ఖండ్‌ను ఇషాన్ కిషన్ (35), విరాట్ (77) ఆదుకున్నారు. చివర్లో 24 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయిన జార్ఖండ్.. చివరకు 194/8 స్కోరు మాత్రమే చేసింది. అయితే సూపర్ లీగ్ గ్రూప్-ఎలో 0.221 నెట్ రన్ రేటు ఉండటంతో ఆ జట్టు ఫైనల్ చేరింది. గురువారం నాడు హర్యానా, జార్ఖండ్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి.

Next Story