- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్మృతి వివాహం వాయిదా.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న జెమిమా
భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్) నుంచి తప్పుకుంది. మహిళల ప్రపంచకప్ తర్వాత డబ్ల్యూబీబీఎల్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె స్మృతి మంధాన వివాహం కోసం భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆమె పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి, జెమిమా మంచి స్నేహితులు. ఈ సమయంలో స్మృతికి మద్దతుగా ఉండేందుకు జెమిమా డబ్ల్యూబీబీఎల్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ జట్టు వెల్లడించింది. ‘జెమీకి ఇది చాలా సవాల్‌తో కూడుకున్న సమయం. ఆమె మిగతా డబ్ల్యూబీబీఎల్ సీజన్‌లో పాల్గొనలేదు. భారత్‌లోనే ఉండాలనే ఆమె విజ్ఞప్తిని మేము అంగీకరిస్తున్నాం. ఆమెకు, స్మృతి మంధాన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం.’ బ్రిస్బేన్ హీట్ సీఈవో టెర్రీ స్వెన్సన్ తెలిపారు. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంలో జెమిమా కీలక పాత్ర పోషించింది.






