బౌండరీ లైన్‌లో మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో వైరల్

by Disha Web Desk 13 |
బౌండరీ లైన్‌లో మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న టీమిండియా ప్లేయర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో డీసీ వైస్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ అటు తన బ్యాటింగ్‌తో తన మాస్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది.ఈ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లో 22 నాటౌట్‌గా నిలిచింది. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరు మధ్య మ్యాచ్ సందర్భంగా.. జెమీమా అకస్మాత్తుగా బౌండరీ లైన్‌లో చేసిన సందడి మాములుగా లేదు. ఈ వీడియోల్లో విభిన్న స్టెప్పులతో అభిమానులకు మాంచి ఎంటర్టైన్‌మెంట్ అందించింది. అభిమానులు ఆమె డ్యాన్స్‌లను ఫోన్స్‌‌లో బంధించి, సోషల్ మీడియాలో షేర్ చేవారు. ఈ వీడియోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

వీటిని జెమీమా స్వయంగా రీట్వీట్ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ విజయానికి దగ్గరగా ఉన్నప్పుడు.. జెమీమా రోడ్రిగ్స్ బౌండరీ లైన్‌పై నిలబడి కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది. ఢిల్లీ-బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా.. ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించలేక.. 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Next Story

Most Viewed