ఇంపార్టెంట్ మ్యాచ్‌లో జెమీమా సూపర్ సెంచరీ

by Gantepaka Srikanth |

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (INDw vs AUSw) తలపడుతున్నాయి.

ఇంపార్టెంట్ మ్యాచ్‌లో జెమీమా సూపర్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (INDw vs AUSw) తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. 339 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు భారట బ్యాటర్లు కూడా అదరగొట్టారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీతో అదరగొట్టారు. నిలకడగా ఆడుతూ 115 బంతుల్లో 10 ఫోర్లతో ఈ మార్కును అందుకున్నారు. మరోవైపు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (89) త్రుటిలో సెంచరీ మిస్ అయ్యారు. అనవసర షాట్‌కు యత్నించి ఔట్ అయ్యారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 303-4 కాగా ఇంకా విజయానికి 32 బంతుల్లో 36రన్స్ చేయాలి. క్రీజులో జెమీమా, రిచా ఉన్నారు.

Next Story