- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ చేసి.. రోజూ ఏడ్చేదాన్ని.. వైఫల్యాలపై జెమీమా రోడ్రిగ్స్
క్రికెట్లో వరుస వైఫల్యాలపై టీమిండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్ పెదవి విప్పింది. కష్టకాలంలో ప్రతిరోజూ ఇంటికి ఫోన్ చేసి ఏడ్చేదాన్నని తెలిపింది.

దిశ, స్పోర్ట్స్: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, అద్భుతమైన పోరాటంతో టీమిండియాను మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేర్చింది జెమీమా రోడ్రిగ్స్. అయితే ఆమె పోరాటం వెనుక అసామాన్యమైన పట్టుదలే కాదు. ఎన్నో మానసిక కష్టాలూ ఉన్నాయి. ఈ పాతికేళ్ల అమ్మాయి ఇప్పుడు నీరాజనాలు అందుకుంటున్నా.. మూడేళ్ల క్రితం 2022లో వరల్డ్ కప్ జట్టులో చోటు కూడా సంపాదించలేకపోయింది. ఆ సమయంలో పూర్ ఫామ్‌తో ఇబ్బంది పడిన ఆమెను వరుస వైఫల్యాలు వెన్నంటాయి. దీంతో వరల్డ్ కప్ జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. ఆ బాధ తట్టుకోలేక ప్రతిరోజూ తను ఏడ్చేదాన్నని ఆమె చెప్పడం.. అభిమానులకు ఆమె బాధను కళ్లకు కట్టినట్లు చెప్తోంది. ఆ సమయంలో మెంటల్ యాంగ్జియిటీతో ఇబ్బంది పడ్డానని, ఆ తర్వాత నెమ్మదిగా ఆ పరిస్థితి నుంచి కోలుకున్నానని ఆమె చెప్పింది. ఈసారి అద్భుతమైన ఫామ్‌తో వరల్డ్ కప్ టీంకు ఎంపికైనా.. ఆరంభంలో వరుసగా ఆమె విఫలమైంది. రెండు డక్‌లు నమోదు చేయడంతోపాటు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.
స్వదేశంలో తొలి వరల్డ్ కప్ ఆడుతున్నాననే ఒత్తిడిలో ఆమె తడబడింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో మ్యాచులో ఆమెను పక్కన పెట్టేశారు కూడా. ఈ ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో ఫోన్ మాట్లాడే సమయంలో రోజూ ఏడ్చేదాన్నని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తల్లిదండ్రులు, స్నేహితులు తనకు అండగా నిలిచారని తెలిపింది. ‘జట్టులో స్థానం కోల్పోతే ఎన్నో అనుమానాలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. అది నేను తట్టుకోలేకపోయా. ఎవరూ మన బలహీనతల గురించి మాట్లాడాలనుకోరు కదా. కానీ నా స్నేహితుల వల్ల ఈ కష్టాలను ఒంటరిగా ఫేస్ చేయాల్సిన అవసరం రాలేదు. కుటుంబానికి కాల్ చేసేదాన్ని. అలాంటి సమయాల్లో సాయం అడగడంలో తప్పేం లేదు’ అని వివరించింది. కాగా, 2022లో ముంబైలోని జింఖానాలో జెమీమాకు గౌరవ సభ్యత్వం ఇచ్చారు. అయితే ఆమె తండ్రి ఈ ప్రాంతంలో మతసంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆమె సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఈ టైంలోనే జెమీమా ఫామ్ కూడా కోల్పోయింది. దీంతో అన్నివైపుల నుంచి ఆమె మానసిక సమస్యలు ఎదుర్కోంది.






