- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రైన SRH స్టార్ ప్లేయర్..
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కత్ ( Jaydev Unadkat ) అదిరిపోయే శుభవార్త

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ జయదేవ్ ఉనద్కత్ ( Jaydev Unadkat ) అదిరిపోయే శుభవార్త చెప్పాడు. తాజాగా ఈ స్టార్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ తండ్రి అయ్యాడు. తన భార్య ఈనెల 18వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు టీమిండియా ఆటగాడు జయదేవ్.
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్ లో పూర్తయిన నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రకటించాడు జయదేవ్. కాగా రిన్ని కాంతారియా అలాగే జయదేవ్ ఉనద్కత్ 2021 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో టీమిండియాలో ఛాన్స్ దక్కించుకొని ఆ తర్వాత.. పేలవ ప్రదర్శనతో స్థానం కోల్పోయాడు.
ఇక ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. ఈ 33 సంవత్సరాల జయదేవ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో అదరగొట్టాడు. మహమ్మద్ షమీ లాంటి ప్లేయర్ హైదరాబాద్ జట్టులో విఫలమైతే... జయదేవ్ మాత్రం రాణించాడు. ఈసారి టోర్నమెంట్ లో ఏడు మ్యాచ్ లు ఆడి 11 వికెట్లు పడగొట్టాడు.
👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h
— Jaydev Unadkat (@JUnadkat) May 28, 2025






