SL VS BAN : జయసూర్యకు ఐదు వికెట్లు.. శ్రీలంక ఇన్నింగ్స్ విజయం

by Harish |

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది.

SL VS BAN : జయసూర్యకు ఐదు వికెట్లు.. శ్రీలంక ఇన్నింగ్స్ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 247 రన్స్ చేయగా.. శ్రీలంక 458 స్కోరు చేసిన విషయం తెలిసిందే. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 133 స్కోరుకే కుప్పకూలింది. మూడో రోజే 6 వికెట్లు పడటంతో ఆ జట్టు ఓటమి శుక్రవారమే ఖరారైంది. శనివారం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ మాయకు బంగ్లా ఆట ఎంతో సేపు లేదు. ఓవర్‌నైట్ స్కోరు 115/6తో ఆట కొనసాగించిన ఆ జట్టు మరో 18 రన్స్ మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి ఐదు ఓవర్లలోనే శ్రీలంక విజయం లాంఛనమైంది. ప్రభాత్ జయసూర్య(5/56) ఐదు వికెట్లతో చెలరేగాడు. టెస్టుల్లో అతనికి ఇది 6వ ఐదు వికెట్ల ప్రదర్శన. చివరి నాలుగు వికెట్లలో మూడు అతనికే దక్కాయి. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్(26) టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు వైఫల్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో శ్రీలంక రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.


Next Story