- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముగ్గురు భారత క్రికెట్‌కు బంగారు నిధులు : నితీశ్ రెడ్డి
రోహిత్, కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా భారత క్రికెట్‌కు బంగారు నిధులు లాంటి వారని టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా భారత క్రికెట్‌కు బంగారు నిధులు లాంటి వారని టీమిండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. తాజాగా జియోహాట్‌స్టార్‌తో నితీశ్ మాట్లాడుతూ.. దిగ్గజ క్రికెటర్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ తరం భారత క్రికెట్‌ను కోహ్లీ, రోహిత్, బుమ్రాలతోపాటు ఇతర క్రికెటర్లు నిర్మించారని చెప్పాడు. వారు భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, మేము వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నాడు. ‘ధోనీ వంటి నాయకత్వ లక్షణాల కలిగి ఉండాలని కోరుకుంటాను. కోహ్లీ దూకుడు, ఆటపై అభిరుచిని ఇష్టపడతాను. ఇక, రోహిత్ ఆడే ఫుల్ షాట్‌ను నేర్చుకోవాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. బుమ్రాను ఎదుర్కోవడం సవాల్‌తో కూడుకున్నదని, అతన్ని ఎదుర్కోవడం ఉత్సాహంగా ఉంటుందన్నాడు. అతని బౌలింగ్‌లో కొన్ని పరుగులు సాధించినా ఆనందపడతానని చెప్పుకొచ్చాడు.






