- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిల్‌తో అనుబంధం.. గంభీర్ కోచింగ్‌పై బుమ్రా ఇంట్రస్టింగ్ కామెంట్స్..!
టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న అనుబంధం, గంభీర్ కోచింగ్‌పై బుమ్రా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తనకు మంచి స్నేహం ఉందని బుమ్రా చెప్పాడు. ఆటలో గిల్‌కు ఎలాంటి సూచనలు కావాలన్నా ఇచ్చేందుకు తను సిద్ధంగా ఉంటానని తెలిపాడు. అదే సమయంలో కెప్టెన్‌గా ఎవరున్నా వారు ఎదిగేందుకు కొంత స్పేస్ ఇవ్వాలని, అంతేకానీ చెవిలో దూరి నసపెట్టకూడదని అన్నాడు. ‘గిల్ కుర్రాడు. తన ఆలోచనా విధానం తనకుంటుంది. అలాంటి టైంలో నేను మధ్యలో దూరి అతని స్టైల్ చెడగొట్టకూడదు. ఏదైనా చెప్పాలని అనిపిస్తే నెమ్మదిగా ఆ విషయం చెప్తా. నేను ఇంతకాలం క్రికెట్ అలాగే ఆడాను. తనకు ఎలాంటి సలహా అవసరమైనా ఇస్తాను’ అని స్పష్టంచేశాడు.
గంభీర్ కోచింగ్ స్టైల్..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ ఎప్పుడూ వ్యక్తిగతంగానే ఉంటుందని, అందర్నీ పిలిచి మాట్లాడటం చాలా తక్కువని బుమ్రా వెల్లడించాడు. ఆటగాళ్లను ఒక్కొక్కరిని గమనించి, ఎవరైనా తప్పు చేస్తుంటే వారితోనే మాట్లాడతాడని చెప్పాడు. ‘భారత క్రికెట్లో ఆసక్తికరమైన దశను గంభీర్ హ్యాండిల్ చేస్తున్నాడని నా అభిప్రాయం. రెండు టూర్లకు ముందు మా టీం పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తోంది. ఇలాంటి టైంలోనే కోచింగ్ స్టాఫ్ కొంత ఓపికతో ఉండాలి. కుర్రాళ్లను డీల్ చేయడంలో కామ్‌గా ఉండాలి. వారిని తొందరపెట్టకూడదు. గంభీర్ అలాగే ఉంటాడు. అందుకే ప్లేయర్లు కూడా సంతోషంగా ఉన్నారు’ అని బుమ్రా పేర్కొన్నాడు.






