- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీం కోసం బుమ్రా మరింత శ్రమించాలి.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్!
టీం కోసం బుమ్రా మరింత శ్రమించాలని, బెన్ స్టోక్స్‌ను చూసి నేర్చుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, స్పోర్ట్స్: మాంచెస్టర్ టెస్టులో బుమ్రా మరింత శ్రమించి టీమిండియాను గెలిపించాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. ఇప్పటికే 2-1తో భారత్ వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలవడం భారత్‌కు అత్యవసరం. ఈ క్రమంలోనే బుమ్రా అవసరమైతే మరింత శ్రమించాలని, లేదంటే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని పఠాన్ అన్నాడు.
‘బుమ్రా వద్ద అద్భుతమైన నైపుణ్యాలున్నాయి. అయితే భారత్ కోసం ఆడుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి. ఐదు ఓవర్లు వేసిన తర్వాత రూట్ బ్యాటింగ్‌కు వస్తే.. ఆరో ఓవర్ వేయకపోతే ఎలా? అలాంటి టైంలోనే కష్టమైనా బౌలింగ్ చేస్తూనే ఉండాలి. అలా చేయలేకపోతే ఆడకుండా విశ్రాంతి తీసుకుంటే బెటర్. ప్లేయర్‌కు అన్నింటికన్నా జట్టే ముఖ్యం’ అని పఠాన్ సూచించాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పెట్టిన ఎఫర్ట్‌ను గుర్తుచేశాడు.
‘భారత్‌కు విజయాలు అందించినంత కాలం బుమ్రా టాప్ బౌలర్‌గా కొనసాగుతూనే ఉంటాడు. అయితే అవసరమైతే మరింత కష్టపడటానికి రెడీగా ఉండాలి. లార్డ్స్ టెస్టులో స్టోక్స్, ఆర్చర్ అదే చేశారు’ అన్నాడు. ఆ మ్యాచులో మార్నింగ్ సెషన్‌లో 9.2 ఓవర్ల స్పెల్ వేసిన స్టోక్స్.. రెండో సెషన్‌లో మరో 10 ఓవర్లు వేశాడు. నాలుగేళ్ల తర్వాత తొలి టెస్టు ఆడుతున్న ఆర్చర్ కూడా లాంగ్ స్పెల్స్ వేయడానికి వెనుకాడలేదు.






