- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jasprit Bumrah : ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చిన బుమ్రా.. బౌలింగ్ చేస్తున్న వీడియో పోస్టు
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ చేయడం మొదలుపెట్టాడు. వెన్ను గాయంతో జట్టుకు దూరమైన అతను దాదాపు నెల తర్వాత నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాలో పర్యటనలో బుమ్రా వెన్ను గాయం బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌తోపాటు చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. బుమ్రా గురువారం తన ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దానికి ప్రతి రోజు పురోగతి సాధిస్తున్నానని రాసుకొచ్చాడు. ఆ వీడియో వైరల్ కావడం మారింది. దీంతో బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ లేదా ఫైనల్ ఆడాలని అభిమానులు కోరుతున్నారు. ఐసీసీ టెక్నికల్ టీమ్ అనుమతితో ఆ మ్యాచ్‌లు ఆడొచ్చు. కానీ, స్వల్ప వ్యవధిలోనే అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమే. ఐపీఎల్ నాటికి అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.






