- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20లకు బుమ్రా రిటైర్మెంట్..?
2027 వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధం అవుతున్నాడు బుమ్రా. ఈ తరుణంలోనే టీ20లకు దూరం అవుతాడని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 లో అద్భుతంగా రాణించిన బుమ్రా, షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే 18 నెలల పాటు టీ20 క్రికెట్ కు బుమ్రా దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీ20లకు దూరం అవుతాడని అంటున్నారు. అంటే రాబోయే 18 నెలల పాటు ఒక్క టీ20 ఆడకుండా బుమ్రా షెడ్యూల్ ఫిక్స్ చేయనుంది బీసీసీఐ.
ఇకపైన బుమ్రా కేవలం వన్డేలు ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేయనుంది. బుమ్రా కూడా దీనికి ఒప్పుకున్నారని సమాచారం. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో బుమ్రా పాత్ర ఎంత కీలకమైందో మనం చూశాం. కీలక సెమీ ఫైనల్ సందర్భంగా బుమ్రా వేసిన స్పెల్, ఇండియాను ఫైనల్స్ కు చేర్చింది. కాబట్టి 2027 వరల్డ్ కప్ లో బుమ్రా సేవలు చాలా అవసరమని భావిస్తోంది బీసీసీఐ. ఇందులో భాగంగానే టీ20లకు బుమ్రాను దూరం చేసి కేవలం వన్డేలు ఆడించబోతోంది.
2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్
2027 వన్డే వరల్డ్ కప్ మరో ఏడాదిన్నర కాలంలోనే ప్రారంభం కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య ఈ ప్రపంచ కప్ జరుగుతుంది. ఇందులో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. 54 మ్యాచులు ఆడనున్నాయి 14 జట్లు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. దక్షిణాఫ్రికాలో మొత్తం 44 మ్యాచ్ లు నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్ లు జింబాబ్వే, నమీబియా వేదికగా జరుగుతాయి.






