బుమ్రాకు గాయం.. బౌలింగ్ కోచ్ ఏమన్నాడంటే?

by Harish |
బుమ్రాకు గాయం.. బౌలింగ్ కోచ్ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా గాయపడ్డాడు. ఆసిస్ తొలి ఇన్నింగ్స్‌లో 81వ ఓవర్‌ వేస్తూ అతను కిందపడిపోయాడు. ఫిజియోలు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత బుమ్రా ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. అనంతరం రెండు వికెట్లు కూడా తీశాడు. రెండో రోజు ఆట అనంతరం బుమ్రా గాయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. బుమ్రా గాయపడలేదని, అతనికి తిమ్మిర్లు వచ్చాయని తెలిపాడు. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు 'బుమ్రా బాగానే ఉన్నాడు.అతనికి తిమ్మిర్లు వచ్చాయి. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు కూడా తీసాడు.టెస్ట్ క్రికెట్‌లో ఆటగాళ్ల గాయాలను దాచలేం.’ అని మోర్కెల్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed