- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రా వచ్చేస్తున్నాడు.. ఆసియా కప్ 2025 ఆడే.. టీం ఇండియా జట్టు ఇదే !
బుమ్రా... ఆసియా కప్ 2025 టోర్నమెంటుకు అందుబాటులో ఉంటాడని తాజాగా బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అతి త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభానికి కంటే ముందే టీమిండియా కు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా... ఆసియా కప్ 2025 టోర్నమెంటుకు అందుబాటులో ఉంటాడని తాజాగా బీసీసీఐ అధికారులు వెల్లడించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
టి20 లలో మంచి రికార్డు ఉన్న బుమ్రా ఆడడం టీమ్ ఇండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇక ఈ టోర్నమెంట్ నేపథ్యంలో మహమ్మద్ సిరాజ్ కు ఛాన్స్ లేదనే తెలుస్తోంది. బుమ్రాతో పాటు అర్ష్ దీప్ బౌలర్ గా రంగంలోకి దిగనున్నాడట. ఇక హార్దిక్ పాండ్యా అలాగే శివం దూబే.. ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా సంజు, అభిషేక్ శర్మ ఉండే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ తరహాలో ఫస్ట్ డౌన్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ బరిలోకి దిగుతాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాలుగవ వికెట్ కు దిగే ఛాన్స్ ఉంది. రింకూ స్థానంలో జితేష్ శర్మ ఫినిషర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది.
మొన్న బెంగళూరు జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. అందుకే అతనికి అవకాశం ఇవ్వనున్నారు. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉండే ఛాన్సులు ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా అదనపు స్పిన్నర్లుగా ఉపయోగపడతారు. ఇందులో మరిన్ని మార్పులు కూడా జరిగే ఛాన్సులు ఉన్నాయి. ఆగస్టు 19వ తేదీన తుది జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అప్పుడు ప్రకటించిన జట్టు ఫైనల్ అవుతుంది.






