- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కపిల్ దేవ్‌ను దాటేసిన బుమ్రా.. వసీమ్ అక్రమత్‌తో సమానం!
by Phanindra |
లార్డ్స్ టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన బుమ్రా.. కపిల్ దేవ్‌ను దాటేసి, వసీమ్ అక్రమత్‌తో సమానంగా నిలిచాడు.

X
దిశ, స్పోర్ట్స్: ‘క్రికెట్ పుట్టిల్లు’గా భావించే లార్డ్స్ మైదానంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దులుకొట్టాడు. ఇది విదేశాల్లో బుమ్రాకు టెస్టుల్లో 13వ ఫైఫర్. దీంతో విదేశాల్లో భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట ఉండేది. ఈ లెజెండరీ ప్లేయర్ 66 విదేశీ టెస్టుల్లో 12సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు. బుమ్రా కేవలం 35 మ్యాచుల్లోనే సాధించగం గమనార్హం. అలాగే సేనా దేశాల్లో బుమ్రాకిది 11వ ఫైఫర్. దీంతో ‘సుల్తాన్ ఆఫ్ స్వింగ్’ వసీం అక్రమ్ రికార్డును కూడా బుమ్రా సమం చేశాడు.
Next Story






