- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాకు షాక్.. మూడో టెస్ట్ నుంచి సిరాజ్ ఔట్!
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే రెండు టెస్టులు పూర్తయ్యాయి. మరో రెండు రోజుల్లో మూడో టెస్ట్ కు కూడా ప్రారంభం కానుంది. అయితే ఎల్లుండి ప్రారంభం కానున్న మూడో టెస్ట్ నేపథ్యంలో టీమిండియా అభిమానులకు ఊహించని షాక్ తగిలింది.
రెండు టెస్టులలో అద్భుతంగా రాణించిన... టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Siraj ) మూడో టెస్ట్ లో ఆడే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. టీమిండియా మేనేజ్మెంట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు, మూడో టెస్టు మధ్యలో కేవలం మూడు రోజుల గ్యాప్ మాత్రమే వచ్చింది. అంతే కాదు తొలి టెస్ట్ లో 41 ఓవర్లు... రెండో టెస్ట్ లో 32 ఓవర్లు సంధించాడు మహమ్మద్ సిరాజ్.
ఒక ఫాస్ట్ బౌలర్.. ఇలా వరుసగా ఓవర్లు వేయడం అరుదు. ఇలాంటి నేపథ్యంలో మూడో టెస్ట్ లో సిరాజ్ ను ఆడిపిస్తే.... వర్క్ లోడ్ పడుతుందని టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచన చేస్తుందట. అందుకే సిరాజ్ ను తప్పించి...బుమ్రా ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ రాత్రి లోపు లేదా రేపు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.






