ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో సిన్నర్.. గాఫ్, బోయిసన్ కూడా!

by Phanindra |

ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో జానిక్ సిన్నర్ అడుగు పెట్టాడు. యూఎస్ స్టార్ కోకో గాఫ్, ఫ్రాన్స్‌కు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ టూయిస్ బోయిసన్ కూడా సెమీస్‌కు దూసుకొచ్చారు.

ఫ్రెంచ్ ఓపెన్‌ సెమీస్‌లో సిన్నర్.. గాఫ్, బోయిసన్ కూడా!
X

దిశ, స్పోర్ట్స్: ఇటలీ టెన్నిస్ స్టార్ జానిక్ సిన్నర్ అద్భుతమైన ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో అడుగు పెట్టాడు. అలెగ్జాండర్ బుబ్లిక్‌ను 6-1, 7-5, 6-0 తేడాతో ఓడించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను సిన్నర్.. కేవలం 49 నిమిషాల్లోనే ఫినిష్ చేయడం గమనార్హం. అలాగే మహిళల సింగిల్స్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ లూయిస్ బోయిసన్ కూడా అదరగొట్టింది. రష్యాకు చెందిన మిర్రా ఆండ్రీవాను 7-6(6), 6-3 తేడాతో వరుస గేమ్స్‌లో ఓడించి సెమీ ఫైనల్స్‌ చేరింది. ఓపెన్ ఎరాలో సెమీస్ చేరిన తొలి వైల్డ్ కార్డ్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. యూఎస్ స్టార్ కోకో గాఫ్ కూడా సెమీస్‌లోకి దూసుకొచ్చింది. మరో అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-7(6), 6-4, 6-1 తేడాతో నెగ్గిన గాఫ్.. ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో అడుగు పెట్టింది.

Next Story