- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
US Open : మళ్లీ వాళ్లిద్దరి మధ్యే ఫైట్.. టైటిల్ ఎవరిదో?
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌పై సిన్నర్(ఇటలీ), అల్కరాజ్(స్పెయిన్) కన్నేశారు.

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్ ప్రారంభంలోనే టైటిల్ ఫేవరెట్స్ ఎవరంటే అందరూ చెప్పింది వారిద్దరి పేర్లే. ఇప్పటికే వారు రెండు గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లో ఎదురుపడ్డారు. విజయం ఎవరిదైనా వారి మధ్య పోటీ అంటే టెన్నిస్ ఫ్యాన్స్‌కు వచ్చే మజానే వేరు. ముచ్చటగా మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌లోనూ తలపడబోతున్నారు. వారె కార్లోస్ అల్కరాజ్, జెన్నిక్ సిన్నర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూఎస్ ఓపెన్‌లో సిన్నర్, అల్కరాజ్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ఆదివారం వారి మధ్య టైటిల్ పోరు జరగనుంది.
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌పై సిన్నర్(ఇటలీ), అల్కరాజ్(స్పెయిన్) కన్నేశారు. సిన్నర్ ఈ సీజన్‌లో వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన అతను మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచాడు. శనివారం జరిగిన సెమీస్‌లో సిన్నర్ కెనడా ఆటగాడు ఫెలిక్స్ అగర్ అలియాసిమ్‌ను ఓడించాడు. నాలుగో సెట్‌లో ఫలితం తేలగా అతను 6-1, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించాడు. ఫెలిక్స్ సవాల్ విసరడంతో సిన్నర్ విజయం కోసం కాస్త శ్రమించాడు. వీరిద్దరు 3 గంటల 21 నిమిషాలపాటు పోరాడారు. మ్యాచ్‌లో సిన్నర్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ ఫెలిక్స్ గట్టిగానే పోటీనిచ్చారు. ఇద్దరూ పోటాపోటీగా ఏస్‌లు, విన్నర్లు కొట్టారు. సిన్నర్ 11 ఏస్‌లు, 33 విన్నర్లు సంధించగా.. ఫెలిక్స్ 9 ఏస్‌లు, 36 విన్నర్లు బాదాడు. కానీ, ఫెలిక్స్ కొన్ని సమయాల్లో ఒత్తిడికి గురై 41 తప్పిదాలు చేయడం అతన్ని మ్యాచ్ నుంచి దూరం చేసింది. ప్రత్యర్థి తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న సిన్నర్ 4 సార్లు బ్రేక్ పాయింట్స్ సాధించాడు.
జకోకు షాక్ ఇచ్చిన అల్కరాజ్
మరో సెమీస్‌లో దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్‌కు అల్కరాజ్ షాకిచ్చాడు. ఈ సీజన్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో అల్కరాజ్ 6-4, 7-6(7-2), 6-2 తేడాతో జకోను మట్టికరిపించాడు. కేవలం 2 గంటల 23 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. జకో తన అనుభవాన్ని ఉపయోగిస్తూ పోటీనిచ్చినప్పటికీ అల్కరాజ్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. అల్కరాజ్ 7 ఏస్‌లు, 31 విన్నర్లతో హవా ప్రదర్శించాడు. అల్కరాజ్ 4 సార్లు బ్రేక్ పాయింట్ సాధిస్తే.. జకో ఒక్కసారి మాత్రమే సాధించాడు. ఒత్తిడికి గురైన జకో 5 డబుల్ ఫౌల్ట్స్, 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో 25వ గ్రాండ్‌స్లామ్ దక్కించుకుని చరిత్ర సృష్టించాలని చూసిన జకోవిచ్‌కు ఈ సీజన్‌లోనూ నిరాశ తప్పలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అల్కరాజ్ యూఎస్ ఓపెన్‌తో సీజన్‌ను ఘనంగా ముగించాలని చూస్తున్నాడు.






