- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ranji Trophy: 65 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి.. ఢిల్లీని చిత్తు చేసిన జమ్మూకశ్మీ
రంజీ ట్రోఫీలో 65 ఏళ్ల రికార్డును జమ్మూకశ్మీర్ బద్దలు కొట్టింది. ఢిల్లీని చిత్తుగా ఓడించి చరిత్ర సృష్టించింది.

దిశ, స్పోర్ట్స్: దేశవాళీ క్రికెట్‌లో జమ్మూకశ్మీర్ జట్టు సంచలనం సృష్టించింది. రంజీ ట్రోఫీ రికార్డులు తిరగరాస్తూ బలమైన ఢిల్లీపై విజయం సాధించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ విజయంతో ఎలైట్ గ్రూప్-డిలో రెండో స్థానానికి ఎగబాకింది. 65 ఏళ్ల జమ్మూకశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఢిల్లీపై గెలవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరి ఇన్నింగ్సులో 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జమ్మూకశ్మీర్‌కు ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (133 నాటౌట్) అద్భుతమైన పోరాటంతో అరుదైన విజయం అందించాడు. కెరీర్ బెస్ట్ స్కోరుతో జమ్మూకశ్మీర్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బ్యాటర్లలో ఆయుష్ బదోనీ (64,72), దోసేజా (65,62) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లెవరూ ఆకట్టుకోలేదు. తొలి ఇన్నింగ్సులో 310 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్.. ఢిల్లీని 211 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాలో ఆన్‌లో ఢిల్లీ 277 పరుగులు చేయగా.. కేవలం మూడు వికెట్లే కోల్పోయిన జమ్మూకశ్మీర్ ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తొలి ఇన్నింగ్సులో ఐదు వికెట్లతో రాణించిన జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.






