గతేడాది రిటైర్మెంట్.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అండర్సన్

by Harish |

ఇంగ్లాండ్ మాజీ బౌలర్, 42 ఏళ్ల జేమ్స్ అండర్సన్ కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగొచ్చాడు.

గతేడాది రిటైర్మెంట్.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన అండర్సన్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ మాజీ బౌలర్, 42 ఏళ్ల జేమ్స్ అండర్సన్ కాంపిటేటివ్ క్రికెట్‌లోకి తిరిగొచ్చాడు. ఇంగ్లాండ్ దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నమెంట్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగాడు. లంకాషైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం డెర్బీషైర్‌తో ప్రారంభమైన కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్ 2 మ్యాచ్‌లో ఆడాడు. దాదాపుగా ఏడాది తర్వాత అండర్సన్ కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతున్నాడు. గాయం కారణంగా లంకాషైర్ తరపున మొదటి ఐదు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అండర్సన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూలైలో వెస్టిండీస్‌పై ఫేర్‌వెల్ టెస్టు మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను ఏ క్రికెట్ ఆడలేదు. ఇంగ్లాండ్ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నాడు. అండర్సన్ 188 టెస్టుల్లో 704 వికెట్లు తీశాడు.


Next Story