వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మెడల్‌కు అడుగు దూరంలో జాస్మిన్

by Phanindra |

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మెడల్‌కు జాస్మిన్ అడుగు దూరంలో నిలిచింది. అద్భుతమైన విజయంతో క్వార్టర్ ఫైనల్స్‌ చేరింది.

వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మెడల్‌కు అడుగు దూరంలో జాస్మిన్
X

దిశ, స్పోర్ట్స్: కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్యంతో మెరిసిన జాస్మిన్ లంబోరియా.. తన తొలి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మెడల్ వైపు దూసుకుపోతోంది. మహిళల 57 కేజీల విభాగంలో బ్రెజిల్‌కు చెందిన ఒలింపియన్ జూసిలన్ సెర్కీరాపై 5-0తో జాస్మిన్ కీలక విజయం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్స్‌కు జాస్మిన్ చేరుకుంది. మరొక్క మ్యాచ్ గెలిస్తే ఆమెకు పతకం పక్కా. అదే సమయంలో భారత్‌కు చెందిన సనామచ చాను (70 కేజీల విభాగం), సాక్షి చౌదరి (54 కేజీల విభాగం) ఈ టోర్నీ నుంచి తప్పుకున్నారు. ఇక పురుషుల విభాగంలో అభినాష్ జామ్వాల్ కూడా మెక్సికోకు చెందిన హూగో బారన్‌పై 5-0తో గెలిచి ముందంజ వేశాడు.

Next Story