PBKS vs DC : చెలరేగిన అయ్యర్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

by Muthe.Rajitha |

ఈ ఐపీఎల్(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్, ఢిల్లీ(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

PBKS vs DC : చెలరేగిన అయ్యర్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ఐపీఎల్(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్, ఢిల్లీ(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ భారీ స్కోర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. శ్రేయాస్(53), జోష్ ఇంగ్లిస్(32), మార్కస్ స్టోయినిస్ (44) పరుగులతో రాణించారు. ఇక ఢిల్లీ బౌలర్స్ లో ముస్తాఫిజిర్ 3, కుల్దీప్, విప్ రాజ్ తలా రెండు, ముకేష్ ఒక వికెట్ తీశారు. 207 పరుగుల భారీ లక్ష్యంతో ఢిల్లీ తదుపరి ఇన్నింగ్స్ లో బరిలోకి దిగనుంది.

Next Story