సిక్స్‌లు, ఫోర్లు కొట్టే జట్టుదే విజయం.. టీ20 క్రికెట్‌పై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Harish |

టీ20 క్రికెట్ పూర్తిగా మారిపోయిందని, సిక్స్‌లు ఫోర్లు కొట్టే జట్టే విజయం సాధిస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.

సిక్స్‌లు, ఫోర్లు కొట్టే జట్టుదే విజయం.. టీ20 క్రికెట్‌పై కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 క్రికెట్ పూర్తిగా మారిపోయిందని, సిక్స్‌లు ఫోర్లు కొట్టే జట్టే విజయం సాధిస్తుందని ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు. గతంలో టీ20 ఫార్మాట్‌లో స్ట్రైక్‌రేట్‌ విషయంలో అతను విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, ఐపీఎల్‌లో తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చుకున్న అతను దూకుడుగా ఆడుతున్నాడు. హైదరాబాద్‌పై 5 బంతుల్లో 15 రన్స్ చేశాడు. శనివారం చెన్నయ్‌తో జరిగిన మ్యాచ్‌లో 150 స్ట్రైక్‌రేటుతో ఆడాడు. 51 బంతుల్లో 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో 77 రన్స్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఢిల్లీ మెంటార్ కెవిన్ పీటర్సన్‌తో జరిగిన చాట్‌లో రాహుల్ టీ20 ఫార్మాట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సిక్స్‌లు, ఫోర్లు కొట్టే సరదాను నేను కోల్పోయాను అనుకుంటా. గేమ్‌‌ను లోతుగా తీసుకెళ్లాలనుకుంటా. ఎక్కడో నా మైండ్‌లో అదే స్టిక్ అయ్యింది. కానీ, నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. దూకుడుగా ఆడాలని గ్రహించాను. క్రికెట్ మారింది. ముఖ్యంగా టీ20 క్రికెట్. పొట్టి ఫార్మాట్ అంటే బౌండరీలు కొట్టడం మాత్రమే. ఏ జట్టు ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు కొడుతుందే ఆ జట్టే గెలుస్తుంది.’అని కీలక వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్‌‌‌ను ఆస్వాదించడం తిరిగి ప్రారంభించానని, ఆ క్రెడిట్ భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కే దక్కుతుందన్నాడు. ‘గతేడాది అంతకంటే ముందు నుంచే నా వైట్‌బాల్ గేమ్‌పై కష్టపడుతున్నా. అభిషేక్ నాయర్ భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి అతనితో కలిసి పనిచేస్తున్నా. నేను ఎలా మెరుగవ్వాలనే విషయాలపై గంటల కొద్ది అతనితో మాట్లాడేవాడిని.’అని రాహుల్ చెప్పుకొచ్చాడు.


Next Story