దిగ్గజ క్రీడాకారుడు కన్నుమూత

by Gantepaka Srikanth |

దిగ్గజ క్రీడాకారుడు కన్నుమూత

దిగ్గజ క్రీడాకారుడు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: క్రీడా లోకంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలా(Nicola Pietrangeli)నే కావడం విశేషం. ఈయన తన కెరీర్లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు. అతని మరణవార్త తెలిసిన క్రీడాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Next Story