- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025: అహ్మదాబాద్ లో వర్షం.. ఫైనల్ కు తీవ్ర అంతరాయం ?
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) ఫైనల్ నేపథ్యంలో... అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) ఫైనల్ నేపథ్యంలో... అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad) పరిసర ప్రాంతాల్లో... వర్షం ప్రారంభమైంది. కాసేపటి క్రితం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన నరేంద్ర మోడీ స్టేడియం అధికారులు... గ్రౌండ్ బాయ్స్ తో... కవర్స్ వేయిస్తున్నారు.
చిరు జల్లులు కాస్త భారీ వర్షంగా మారితే ప్రమాదం అని... గ్రౌండ్ బాయ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వెంటనే స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇవాళ వర్షం లేదని ఉదయం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వర్షం పడిన అర్ధరాత్రి వరకైనా మ్యాచ్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వ్ డే కూడా ఉంది.
ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2025 ఫైనల్ నేపథ్యంలో.. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) మధ్య ఫైట్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇవాల్టి మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.






