- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్‌కు ఒకే రోజు మూడు పతకాలు.. బంగారు పతకం సాధించిన సురుచి
షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌ను భారత్ ఘనంగా మొదలుపెట్టింది.

దిశ, స్పోర్ట్స్ : ఖతారులో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్‌ను భారత్ ఘనంగా మొదలుపెట్టింది. మొదటి రోజే మూడు పతకాలు సాధించింది. అందులో బంగారు పతకం ఉండటం విశేషం. మహిళా షూటర్ సురుచి సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అదరగొట్టింది. గురి చూసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. శనివారం జరిగిన ఫైనల్‌లో సురుచి 245.1 స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా జూనియర్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. అదే విభాగంలో భారత్‌కే చెందిన మరో షూటర్ సైన్యమ్ రజత పతకం సాధించింది. 243.3 స్కోరుతో ఆమె రెండో స్థానంలో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను బాకర్(179.2) ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ 5వ స్థానంతో సరిపెట్టింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ రాణా సామ్రాట్ కాంస్యం దక్కించుకున్నాడు. ఫైనల్‌లో అతను 221. 5 స్కోరు చేశాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్(201.2) 4వ స్థానంలో నిలిచాడు.






