- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదరగొట్టిన హైదరాబాద్ అమ్మాయి ఈషా.. షూటింగ్ వరల్డ్ కప్‌లో సిల్వర్ మెడల్ కైవసం
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తెలంగాణ అమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ అదరగొట్టింది.

దిశ, స్పోర్ట్స్ : అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తెలంగాణ అమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన ఈషా సింగ్ అదరగొట్టింది. శనివారం జరిగిన 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్‌లో రజత పతకం సాధించింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 9వ స్థానంలో నిలిచిన ఆమె ఫైనల్‌లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంది. ఫైనల్‌లో మొదట ఆమె పేలవ ఆరంభమే చేసింది. మొదటి ఐదు సిరీస్‌లలో రెండు మాత్రమే విజయవంతమైన షాట్లు చేసింది. ఆ తర్వాత పుంజుకున్న ఈషా వరుసగా 16 విజయవంతమైన షాట్లు కొట్టింది. దీంతో 35 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకుంది.
అయితే, పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్, భారత స్టార్ షూటర్ మను బాకర్ 6వ స్థానంతోనే సరిపెట్టడం గమనార్హం. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 3వ స్థానంలో నిలిచిన ఆమె ఫైనల్‌లో మాత్రం తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది. చైనాకు చెందిన సున్ యుజీ స్వర్ణం గెలవగా.. ఫెంగ్ సిక్సువాన్ కాంస్యం సాధించింది. మరోవైపు, మరో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. శుక్రవారం రాత్రి జరిగిన 50 మీటర్ల 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఆమె 458.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి విజేతగా నిలిచింది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. అందులో ఓ స్వర్ణం, రజతం, కాంస్యం ఉన్నాయి.






