షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యం గెలిచిన సిఫ్ట్ కౌర్

by Harish |

ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్ సిఫ్ట్ కౌర్ కాంస్య పతకం గెలుచుకుంది.

షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో పతకం.. కాంస్యం గెలిచిన సిఫ్ట్ కౌర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా షూటర్ సిఫ్ట్ కౌర్ సత్తాచాటింది. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. గురువారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్‌లో సిఫ్ట్ కౌర్ 592 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌లోనూ మెరిసి ఆమె 453.1 స్కోరుతో కాంస్యం సాధించింది. నార్వేకు చెందిన జీనెట్ హెగ్ డ్యూస్టాడ్ 466.9 స్కోరు చేసి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ఈ ఏడాది సిఫ్ట్ కౌర్‌కు ఇది రెండో వరల్డ్ కప్ మెడల్. ఏప్రిల్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ఆమె స్వర్ణం దక్కించుకుంది. మరోవైపు, ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో పతకం. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఈవెంట్‌లో ఎలవెనిల్ వలరివన్ కూడా కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే.


Next Story