జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల జోరు.. మరో రెండు పతకాలు కైవసం

by Harish |   (  Updated:2025-05-25 17:50:53  IST  )

ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది.

జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత షూటర్ల జోరు.. మరో రెండు పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : జర్మనీలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత యువ షూటర్ల పతకాల పంట కొనసాగుతోంది. ఆదివారం మరో రెండు పతకాలు ఖాతాలో చేరాయి. ఆ రెండు మెడల్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనే దక్కాయి. నరేన్ ప్రవీణ్-క్యాతీ చౌదరి జోడీ రజతం గెలవగా.. హిమాన్షు-శాంభవి క్షీర్‌సాగర్ జంట కాంస్యం సాధించింది. గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో నరేన్ ప్రవీణ్-క్యాతీ చౌదరి ద్వయం 14-16 తేడాతో చైనా జోడీ చేతిలో పోరాడి ఓడి సిల్వర్‌తో సరిపెట్టింది. ఇక, బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో శాంభవి, హిమాన్షులు 17-9 తేడాతో అమెరికాకు చెందిన స్పెన్సెర్-లేక్ గ్రిఫిన్ జంటను ఓడించి కాంస్యం సొంతం చేసుకున్నారు. తాజాగా చేరి రెండు పతకాలతో భారత్ మెడల్స్ సంఖ్య 10కి చేరింది.

Next Story