- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత గడ్డపైనా ఫెయిల్, సంజుపై వేటు.. అతనికే ఛాన్స్
భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు సంజు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టీ20 లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా, సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు సంజు. న్యూజిలాండ్ తో జరిగిన ఐదు టీ20 లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా సరిగ్గా ఆడలేదు. సూర్య కుమార్ యాదవ్ తో పాటు గౌతమ్ గంభీర్ కూడా వరుసగా చాన్సులు ఇచ్చేందుకే మొగ్గు చూపారు.
కానీ సంజు ఆటలో ఎలాంటి మార్పు రాలేదు. శనివారం రోజు తిరువనంతపురం లో ఛాన్స్ వచ్చినప్పటికీ మరోసారి విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో చివరి టి20 మ్యాచ్ లో కేవలం 6 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఓవరాల్ గా ఈ ఐదు టి20లో మొత్తం 50 పరుగులు కూడా సాధించలేకపోయాడు. దీంతో ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో సంజుకు తుది జట్టులో అవకాశం రాబోదు అంటూ చర్చ జరుగుతోంది. ఇషాన్ కిషన్ కు తుది జట్టులో అవకాశం వస్తుందని అంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సిరీస్లో ఇషాన్ అద్భుతంగా రాణించాడు.






