- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిలక్, గైక్వాడ్ బాటలోనే ఇషాన్ కిషన్.. ఆ జట్టుతో ఒప్పందం
టీమ్ ఇండియా యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ ఇంగ్లాండ్‌లో జరిగే దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్ ఆడబోతున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ ఇంగ్లాండ్‌లో జరిగే దేశవాళీ టోర్నీ కౌంటీ చాంపియన్‌షిప్ ఆడబోతున్న విషయం తెలిసిందే. గైక్వాడ్ యార్క్‌షైర్‌తో, హాంప్‌షైర్ క్లబ్‌లతో ఒప్పందం చేసుకున్నారు. వారి బాటలోనే యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు నాటింగ్‌హామ్‌షైర్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 10 రోజుల వ్యవధిలో కౌంటీ చాంపియన్‌షిప్ ఆడేందుకు ఒప్పందం చేసుకున్న మూడో భారత ప్లేయర్ కిషన్.
సౌతాఫ్రికా క్రికెటర్ కైల్ వెర్రెయన్నె స్థానంలో కిషన్‌ను నాటింగ్‌హామ్‌షైర్ జట్టులోకి తీసుకుంది. ఆ క్లబ్ తరపున కిషన్ రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. రెండువారాలపాటు ఇంగ్లాండ్‌లో ఉంటాడు. ఈ నెల 22 నుంచి 26 వరకు యార్క్‌షైర్‌తో, ఈ నెల 29 నుంచి జూలై 2 వరకు సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కౌంటీ క్రికెట్ ఆడటం కిషన్‌కు ఇదే తొలిసారి. ‘నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి ఇది నాకు చక్కటి అవకాశం. నేను అత్యుత్తమ క్రికెటర్ అని నిరూపించుకోవాలి. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఆడటం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.’అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
- Tags
- Ishan Kishan






