టీ20 వరల్డ్ కప్‌లో విధ్వంసం.. 8వ ర్యాంక్‌కు దూసుకొచ్చిన ఇషాన్ కిషన్

by Harish |

టీ20 వరల్డ్ కప్‌లో విధ్వంసం.. 8వ ర్యాంక్‌కు దూసుకొచ్చిన ఇషాన్ కిషన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రభావం చూపించాడు. ఐసీసీ బుధవారం రిలీజ్ చేసి ర్యాంకింగ్స్‌లో ఇషాన్ 8వ ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. ఏకంగా 17 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు సంపాదించాడు. వరల్డ్ కప్‌లో 158 రన్స్ చేసిన ఇషాన్ ప్రస్తుతం భారత్ తరపున టాప్ స్కోరర్ కొనసాగుతున్నాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాక్‌పై(77 రన్స్) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టాప్-10లో నలుగురు భారత క్రికెటర్లు ఉండటం విశేషం. అభిషేక్ శర్మ నం.1 స్థానంలో కొనసాగుతుండగా తిలక్ వర్మ ఒక్క స్థానం మెరుగుపర్చుకుని 4వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సూర్యకుమార్ 6వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అక్షర్ పటేల్ 4 స్థానాలు, బుమ్రా 6 స్థానాలు ఎగబాకి వరుసగా 14, 15 ర్యాంక్‌ల్లో నిలిచారు. కుల్దీప్ కూడా 5 స్థానాలు వెనక్కినెట్టి 25వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో పాండ్యా 3వ స్థానాన్ని కాపాడుకోగా.. దూబె 3 స్థానాలు అధిగమించి 9వ ర్యాంక్‌లో నిలిచాడు.


Next Story