నీకేమైనా కళ్ళు దొబ్బాయా.. ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ పై ట్రోలింగ్

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో( IPL 2025) భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య

నీకేమైనా కళ్ళు దొబ్బాయా.. ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ పై ట్రోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో( IPL 2025) భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో... మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్... దుమ్ము లేపుతోంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే... ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో... హైదరాబాద్ ఆటగాడు ( Ishan Kishan ) చేసిన పనికి అందరూ నవ్వుకున్నారు.

పంజాబ్ ప్లేయర్ కొట్టిన ఓ బంతిని... బౌండరీ గేటు దగ్గర ఆపే ప్రయత్నం చేశాడు హైదరాబాద్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ( Ishan Kishan). అయితే ఆ బంతి ఆపే ప్రయత్నంలో... డ్రైవింగ్ కూడా చేశాడు. అనంతరం లేచి నిలబడ్డ ఇషాన్ కిషన్... బంతి కోసం గ్రౌండ్ మొత్తం వెతికాడు. తన కాళ్ల దగ్గర ఉన్న బంతిని గమనించని ఇషాన్ కిషాన్.. దాని కోసం తెగ వెతికేశాడు. అయినా కూడా ఆ బంతిని గుర్తించలేకపోయాడు.

అయితే అంతలోపే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్... వచ్చి ఆ బంతిని బౌలర్ కు వేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన క్రికెట్ అభిమానులు... ఇషాన్ కిషన్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నీకు కళ్ళు దొబ్బాయా ? అంటూ మండిపడుతున్నారు. అటు ఈ మ్యాచ్ లో ఇశాన్ కిషన్ ఒక్కడే కాదు హైదరాబాద్ ప్లేయర్లందరూ ఫీల్డింగ్ లో దారుణంగా విఫలమయ్యారు.

Next Story