- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌కు కోహ్లీ రిటైర్మెంట్?.. ఆర్సీబీని అందుకే అమ్ముతున్నారా?
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడంతో వచ్చిన క్రేజ్ కాదది. ఐపీఎల్ ఆరంభం నుంచే ఆ జట్టుకు విపరీతమైన ఆదరణ ఉంది. ఈ సీజన్‌కు ముందు ఒక్కసారి కూడా విజేతగా నిలువకపోయినప్పటికీ ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. దానికి కారణం విరాట్ కోహ్లీనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ లేకుండా ఆర్సీబీని ఊహించడం కష్టం. కానీ, విరాట్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకబోతున్నాడన్న పుకారు మొదలైంది. అతను ఎక్కువ కాలం ఐపీఎల్‌లో కొనసాగలేడా? అంటే విశ్లేషకులు అవుననే చెబుతున్నారు. ఆర్సీబీని అమ్మకానికి పెడుతున్నట్టు ఫ్రాంచైజీ ఓనర్ డియాజియో స్పష్టం చేసిన తర్వాత విరాట్ రిటైర్మెంట్‌పై వార్తలు మొదలయ్యాయి.
వచ్చే ఏడాది ఆర్సీబీ చేతుల మారబోతుంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి అమ్మకం ప్రక్రియ ముగుస్తుందని డియాజియో తెలిపింది. డియాజియో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక విరాట్ కోహ్లీ కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ ప్రభావం ఫ్రాంచైజీ విలువపై కచ్చితంగా పడుతుందని, దాన్ని ముందే ఊహించి ప్రస్తుత యాజమాన్యం తప్పుకుంటుందని చెబుతున్నారు. ‘ఆర్సీబీ ఒక్క టైటిల్ గెలవనప్పుడు కూడా టాప్-3 బ్రాండ్ వాల్యూను కలిగి ఉంది. దానికి కారణం కోహ్లీ. అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే కచ్చితంగా ఆ ప్రభావం ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూపై ప్రభావం చూపుతుంది.’అని ఏఎంపీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు ఇంద్రనీల్ దాస్ బ్లాహ్ తెలిపారు.
మరికొందరు కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్సీబీతో సంబంధాన్ని కలిగి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం కచ్చితంగా ఆర్సీబీ దీర్ఘకాలిక బ్రాండ్ ఈక్విటీకి అనిశ్చితిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ మోస్ట్ వాల్యుబుల్ ఫ్రాంచైజీగా నిలిచింది. 2024లో ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 227 మిలియన్ డాలర్లు ఉండగా ఈ ఏడాది 269 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీ వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.






