- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : IPL లో చీర్స్ గర్ల్స్ చిందులు లేనట్టేనా?
భారత్ - పాకిస్తాన్(Bharat - Pakistan) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్(IPL) అకస్మాత్తుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - పాకిస్తాన్(Bharat - Pakistan) మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్(IPL) అకస్మాత్తుగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ(Ceasefire) ఒప్పందం జరుగడంతో ఐపీఎల్ పున:ప్రారంభం(IPL Re Start)పై బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. మే 17వ తేదీ నుంచి జూన్ 3 వరకు మిగిలిన మ్యాచులు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. అయితే తిరిగి రీ స్టార్ట్ కానున్న పొట్టి క్రికెట్(IPL Re Start) బోసి పోనుందా? డీజే(DJs)ల మోత, చీర్స్ గర్ల్స్ చిందులు(Cheer Leaders Dances) ఉండవా? అంటే అవును.. అవేవీ లేకుండానే మిగిలిన సీజన్ కొనసాగించనున్నట్టు సమాచారం.
పాక్ తో జరిగిన యుద్ధం(India Pakistan War)లో, అంతకముందు పహల్గాం ఉగ్రదాడిలో ఎంతోమంది తమ ఆత్మీయులని కోల్పోయారని.. వారు కన్నీళ్లలో మునిగిపోయి ఉంటే సంబరాలు చేసుకోవడం భావ్యం కాదని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు భారత్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కూడా బీసీసీఐకి ఈ కీలక వినతిని చేశారు. డిజే మ్యూజిక్, చీర్ గర్ల్స్ డ్యాన్సులు వంటివి లేకుండానే మిగిలిన మ్యాచులను పూర్తి చేయాలని సూచించారు. తమవారిని కోల్పోయిన బాధల్లో వారుంటే వేడుకలగా సీజన్ నిర్వహించుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయ పడ్డారు. దీనినిబట్టి ఇక మిగిలిన మ్యాచులు ఎలాంటి హడావిడి లేకుండానే సైలెంట్ సాగనుందని తెలుస్తోంది.






