వన్డే వరల్డ్ కప్-2027 ఆడాలంటే కోహ్లీ, రోహిత్‌లకు అదొక్కటే దారి : ఇర్ఫాన్ పఠాన్

by Harish |

టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు.

వన్డే వరల్డ్ కప్-2027 ఆడాలంటే కోహ్లీ, రోహిత్‌లకు అదొక్కటే దారి : ఇర్ఫాన్ పఠాన్
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టులకు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ దిగ్గజ క్రికెటర్లు 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడటం వారి ఫామ్, ఫిట్‌నెస్‌పైనే ఆధారపడి ఉంది. తాజాగా ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని చెప్పాడు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలనుకుంటే వారికి ఫిట్‌నెస్ అతి పెద్ద సవాల్‌గా మారుతుందన్నాడు. గేమ్ ఫిట్‌నెస్ కోసం వాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలన్నాడు.

‘వారిద్దరూ బిగ్ ప్లేయర్లు. ఏం చేయాలో వారికి తెలుసు. వారికి ఎంతో అనుభవం ఉంది. కానీ, వాళ్లు టీ20లు ఆడటం లేదు. కాబట్టి, వన్డే వరల్డ్ కప్‌కు ముందు కొన్ని మ్యాచ్‌లే ఆడగలరు. వాటి మధ్య కూడా గ్యాప్ ఉంటుంది. వారు ఫిట్‌గా ఉండటానికి సాధారణ గేము సమయం అవసరం. అప్పుడే 2027 వరల్డ్ కప్ కల నిజం అవుతుంది.’అని చెప్పాడు. రోహిత్ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాడని, అతని కష్టపడుతున్నాడని తెలిపాడు. అయితే, రెగ్యులర్ ఫిట్‌నెస్, గేము ఫిట్‌నెస్‌కు చాలా తేడా ఉందన్నాడు. రోహిత్, కోహ్లీ రెగ్యులర్ క్రికెట్ ఆడలేకపోతే వారు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలన్నాడు. కాగా, మూడు నెలల తర్వాత రోహిత్, కోహ్లీ కాంపిటేటివ్ క్రికెట్‌కు అందుబాటులోకి రానున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు వారు ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్ తర్వాత వారిద్దరూ కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.


Next Story