పాకిస్తాన్ ఘోర ఓటమి.. ఇర్ఫాన్ పఠాన్ ర్యాగింగ్.. వీడియో వైరల్

by velandi.Saikiran |   (  Updated:2026-02-16 15:20:11  IST  )

టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో పాకిస్తాన్ పై భార‌త్ విజ‌యం సాధించింది. ఈ త‌రుణంలోనే బాలీవుడ్ పాట‌కు స్టెప్పులు వేశారు ఇర్ఫాన్ ప‌ఠాన్.

పాకిస్తాన్ ఘోర ఓటమి.. ఇర్ఫాన్ పఠాన్ ర్యాగింగ్.. వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ ( T20 world cup 2026 ) నేపథ్యంలో పాకిస్తాన్ ఘోర ఓటమి చవి చూసింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 61 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ( Pakistan) ఓడిపోయిన సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. నిత్యం పాకిస్తాన్ క్రికెట్ జట్టును విమర్శలు చేసే ఇర్ఫాన్ పఠాన్, డాన్స్ చేస్తూ ఇండియాకు ( India) మద్దతు తెలిపాడు.

పాకిస్తాన్ ఘోర ఓటమి.. ఇర్ఫాన్ పఠాన్ ర్యాగింగ్

భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ ను మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan ) దారుణంగా ట్రోలింగ్ చేశాడు. ఆఫ్గన్ జిలేబీ ( Afghan Jalebi ) అనే బాలీవుడ్ పాటకు స్టెప్పులు వేస్తూ, పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిందనే సంకేతాన్ని ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన భారత అభిమానులు కూడా తమ స్టైల్ లో స్పందిస్తున్నారు. పాకిస్తాన్ పరువు తీసేలా ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే ప్లాన్ చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ చేసి పాకిస్తాన్ పరువు తీసాడని అంటున్నారు.

సమిష్టిగా ఆడికి గెలిచిన భారత జట్టు

టీ20 వరల్డ్ కప్ 2026 ( T20 world cup 2026 ) నేపథ్యంలో భారత జట్టు అద్భుతంగా రానించింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే అమెరికా, నమీబియా పై విజయం సాధించిన భారత జట్టు, ఆదివారం పాకిస్తాన్ జట్టును కూడా చితక బాదేసింది. కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించి, విక్టరీ కొట్టింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో ఏకంగా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇందులో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.

ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడిన సూర్య కుమార్ యాదవ్ సేన, 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు, తడబడింది. భారత బౌలింగ్ దెబ్బకు 18 ఓవర్లలో 114 పరుగులు చేసి పాకిస్థాన్ ( Pakistan) ఆలౌట్ అయింది. దీంతో ఇండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో 77 పరుగులు సాధించిన ఇషాన్ కిషన్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉండ‌గా, టీ20 వరల్డ్ కప్ 2026 నేపథ్యంలో భార‌త్ మూడు విజ‌యాల‌ను న‌మోదు చేసుకుంది. దీంతో సూప‌ర్ 8 లోకి ప్ర‌వేశించింది. ఇక అటు పాకిస్తాన్ జ‌ట్టు మాత్రం సూప‌ర్ 8 లోకి వెళ్లేందుకు మ‌రో మ్యాచ్ క‌చ్చితంగా ఆడాల్సిన అవ‌సరం ఉంది.

పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. ఆప్ఘనిస్తాన్, బలుచిస్తాన్ ప్రజల సంబరాలు

Next Story